జై భీం.. జై మాల అంటే హైదరాబాద్ దద్దరిల్లాలి. ఒక పిలుపు తో ఆత్మగౌరవం కాపాడుకునేందుకు వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు అని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో సభ పెడితే ఎంత మంది వస్తారా అన్నారు. మాల సత్తా ఏందో చూపిస్తా అని సభను ఏర్పాటు చేశాము. దేశంలో కులవివక్ష కొనసాగుతుంది చదువులో నిధుల్లో సమాన అవకాశం కల్పిచలేదు. బాబా సాహెబ్ అంబెడ్కర్ దళితులకు ఫ్రీడమ్ కోసం పాటు పడ్డారు. కుల వివక్ష గురవుతున్నవారంత హోమోజినియస్ ఆర్టికల్ 341 చెబుతోంది. క్రిమిలేయర్ తీసుకు రావాలని చూస్తున్నారు. ఇంకా ముందు రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉంది.
మాలలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ సభ హెచ్చరిక. కాకా వెంకట స్వామి ఎక్కడ కులం అడిగి విద్య అందించలేదు. గుడిసెల పోరాటం చేసి కులం పేరుతో ఇండ్లు ఇవ్వలేదు. మన బలం మన కష్టంతో మాలలు పేరు సంపాదించుకున్నాం. ప్రపంచంలో టాప్ లో అంబెడ్కర్ విగ్రహాలు ఉంటాయి. పేదల కోసం కష్టపడిన వ్యక్తి బాబా సాహెబ్. అంబెడ్కర్ ను విమర్శిస్తే… ఖబర్దార్ ఇక మాలలు ఊరుకోరు. రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉంది. అలాంటి రాజకీయ పార్టీలకు చెంపపెట్టు మన ఈ సభ మంత్రి పదవి కోసం మాలల పోరాటం అంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని. పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఎన్నో పదవులు ఇస్తాం అంటూ ఆఫర్ వచ్చాయి. తృణపాయం గా విడిచి పెట్టాను. ED దాడులు చేసిన వెనక్కి తగ్గలేదు. మీ అందరికి మేము అండగా ఉన్నాం అని వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు.