ఇటీవల సిని నటుడు, ఎస్వీబీసి మాజీ చైర్మన్ పృథ్వీ రాజ్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక మహిళతో ఆయన సరసంగా మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాతో పాటు ప్రధానంగా మీడియాలో హల్చల్ కావడ౦తో ఆయనపై అధిష్టానం సీరియస్ కావడం తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎస్వీబీసి మహిళా ఉద్యోగులతో పాటు ఎస్వీబీసి అధ్యక్షుడు కూడా ఆరోపణలు చేసారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ ముందుకు సాగడం లేదని సమాచారం. ఆయనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని అంటున్నారు. పృథ్వీరాజ్ వ్యవహారంపై సమాచారం ఇస్తున్నారు గాని ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకి రావడం లేదట. ఇక ఆయనతో ఫోన్ సంభాషణలో మాట్లాడిన మహిళ కూడా
ఇప్పటి వరకు ముందుకి వచ్చి ఆమె ఫిర్యాదు చేయలేదు. మీడియాకు ముందుకి రావడానికి ఇష్టపడటం లేదట. ఈ వ్యవహారంతో తాను ఇప్పటికే అల్లరిపాలై ఇబ్బందులు పడుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల చుట్టూ తిరిగలేనని ఆమె చెప్పిందని వార్తలు వస్తున్నాయి. దీనితో విజిలెన్స్ అధికారులు ఆ ఆడియోతో ముందుకి వెళ్ళలేమని అంటున్నారట. ఈ పరిస్థితుల్లో విచారణ ముందుకి వెళ్ళడం కష్టమనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.