వయసు పెరుగుతుంటే శరీరంలోని అవయవాలు బలహీనపడినట్లే మెదడు కూడా దాని చురుకుదనాన్ని కోల్పోతుంది. శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి వ్యాయామాలు చేసినట్లే మెదడు కోసం ఎక్సర్సైజెస్ చేయాలి.
ఎలాంటి వ్యాయామాలు చేస్తే మెదడు చురుకుగా ఉంటుందో తెలుసుకుందాం.
వాడకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది. మెదడుకు పని చెప్పే పనులు మీరు చేయకపోతే అది దాని చురుకుదనాన్ని కోల్పోతుంది. కాబట్టి మెదడుకు పని చెప్పే పనులు చేయాలి.
సుడోకు:
మెమొరీ గేమ్స్ అయిన సుడోకు, క్రాస్ వర్డ్స్ వంటి గేమ్స్ ఆడటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఇలాంటి గేమ్స్ కచ్చితంగా ఆడండి.
ఊహలు:
రేపు ఏం జరుగుతుందో ఊహిస్తూ దాన్ని మీరు కళ్ళ ముందే చూస్తున్నట్లు కలలు కనండి. ఇది బ్రెయిన్ కు మంచి ఎక్సర్సైజ్ లాగా పని చేస్తుంది. రాత్రి పడుకోవడానికి ఐదు నిమిషాలు ముందు ఈ వ్యాయామం చేయండి.
ధ్యానం:
దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒక పని మీద దృష్టి పెరుగుతుంది. అంతేకాదు, జ్ఞాపకశక్తిని అమాంతం పెంచుతుంది. రోజులో కనీసం 10 నుండి 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి.
ప్రాణాయామం:
రోజులో కొంతసేపు ప్రాణాయామం చేయటం వల్ల కాన్సెంట్రేషన్ పెరుగుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోండి:
ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు. దానివల్ల బ్రెయిన్ కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది.
వ్యాయామం:
ఫిజికల్ గా 20 నుంచి 30 నిమిషాల పాటు ప్రతిరోజు కచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి.
±+++