కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని HMDA గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ చేసిన ఉద్యమం కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించి, ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లారని అన్నారు. కార్మికుల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా మోసం చేసింది గత ప్రభుత్వం అన్నారు.
వారి హక్కుల కోసం పోరాడిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారిని పరామర్శించేందుకు ఒక్క బీఆర్ఎస్ నేతలు వెళ్లలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలను ప్రజల్లోకి బస్సుల ద్వారా తీసుకువెళ్లిన ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ సదా రుణపడి ఉంటుందని అన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని పేర్కొన్నారు. గత పాలకులు ఆర్టీసీని నష్టాల్లోకి నెడితే.. తాము 4వేల కోట్లు ఆర్టీసీకి మహాలక్ష్మీ పథకం సబ్సీడీని మంజూరు చేసి.. సంస్థను లాభాల పట్టించామని తెలిపారు.