ప్రయోగాలతోనే ఫలితాలు రాబట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్న బిజేపీ.. అదే వారి టార్గెట్ హా..?

-

తెలంగాణాలో కమలం పార్టీ వ్యూహం మార్చింది.. సాంప్రదాయ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకోవడంతో పాటు కొత్త ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది.. సభ్యత్వాల్లో స్పీడ్ పెంచి.. గతంలో ఎన్నడూ లేనంతగా మెంబర్ షిప్ చేయించింది.. ఎవరి స్థాయిలో వారు పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నారు.. టార్గెట్ 2029 అన్నట్లుగా సీరియస్ గా పనిచేస్తోంది..

తెలంగాణ బిజేపీ నాయకత్వం అధికారం వైపు అడుగులు వేస్తోంది.. 35లక్షల సభ్యత్వాలను చేయించిన ఆ పార్టీ నేతలు.. అన్ని స్థాయిల్లో వేసే కమిటీల్లో బలమైన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తోంది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన పలితాలు రాకపోయినా.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఓట్టు, సీట్లు పెంచుకుంది.. ఎనిమిది ఎంపీ సీట్లతో.. 35 శాతం ఓట్లు పెరిగాయి.. సంస్తాగత ఎన్నికల ద్వారా మరింత బలోపేతం అయి.. లోక్ సభలో పడిన ఓట్లును పదిలపరుచుకోవాలనేది బిజపీ అగ్రనాయతక్వం ప్లాన్ గా తెలుస్తోంది..

తెలంగాణలో మొత్తం 36వేల పోలింగ్ బూత్ లు ఉంటే.. వాటిల్లో కనీసం 25వేల పోలింగ్ బూత్ లకు కమిటీ వేసే ఆలోచనలో కాషాయం పార్టీ ఉందట.. బూత్ కమిటీలను తూతూ మంత్రంగా కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలకు పనికొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటోందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు బిజేపీకి అర్బన్ పార్టీ ఇమేజ్ మాత్రమే ఉండేది.. కానీ గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఓట్లను సాధించడంతో.. తాము అక్కడా ఉంటాం.. ఇక్కడా ఉంటాం అన్న సంకేతాలున ప్రత్యర్ది పార్టీలకు పంపింది.

ఈసారి జరిగే లోకల్ బాడీ ఎన్నికలను లైట్ తీసుకోకుండా.. సీరియస్ గా పనిచెయ్యాలనే లక్ష్యంతో ఆ పార్టీ రాష్ట నాయకత్వం ఉందట.. ఇందుకోసం సీనియర్ నేత ఈటెల రాజెందర్ తో పార్టీ ఓ కమిటీ కూడా వేసిందట.. కమిటీలను త్వరగా పూర్తి చేసేందుకు వర్క్ షాపులను నిర్వహిస్తోంది తెలంగాణ బిజేపీ.. రూరల్ ఏరియాల్లో పాతుకుపోవాలనే ప్లాన్ ను కమలం నాథులు వేస్తున్నారట. బూత్, మండల కమిటీల్లోనే ప్రయోగాలు చేసి.. బలమైన నేతలకి బాధ్యతలు ఇవ్వాలని రాష్ట నాయకత్వం పావులు కదుపుతోంది. రాస్టంలో కొత్త అధ్యక్షుని నియామకం తర్వాత స్పీడ్ పెంచాలని ఆ పార్టీ సీనియర్లు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news