తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈనెల 08న కీలక సమావేశం నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో సంయుక్త సమావేశం జరుగనున్నట్టు తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలో తాజా పరిస్థితులు అసెంబ్లీ, మండలీ సమావేశాలపై కార్యచరణపై చర్చించనున్నట్టు సమాచారం.
మరోవైపు ఈ సారి సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే అసెంబ్లీలో వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య వాదోపవాదనలు నడుస్తున్నాయి. ఇక కేసీఆర్ కూడా ఎంట్రీ ఇస్తే.. రచ్చ రంబోలే అని చెప్పవచ్చు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా..? లేదా అనేది ఎల్లుండి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశంలో తెలువనుంది.