రేషన్ బియ్యంలో నాకు ఏ సంబంధం లేదు : ద్వారంపూడి

-

కాకినాడ నుంచి రేషన్ రైస్ వెళ్తుందని ఆరు నెలలుగా స్టోరీలు చెప్తున్నారు. అయితే ఇండియా లో పండే రైస్ లో 98 శాతం కాకినాడ నుంచి వెళ్లేలా నేను చేశాను అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రైస్ ఎగుమతి వలన కార్మికులు బాగుపడ్డారు. ఎమ్మెల్యే కొండబాబుకి పార్టీలో, ప్రభుత్వం లో మనుగడ లేదు. ఎమ్మెల్యేతో మాట్లాడితే పిచ్చోడి తో మాట్లాడినట్టు ఉంటుంది. కొండ బాబు నీ ఇష్టం వచ్చినట్లు వాగకు. రేషన్ బియ్యంలో నాకు నా కుటుంబానికి సంబంధము లేదు.

మా తమ్ముడు రైస్ ఎక్సపర్ట్ చేస్తాడు. ఏపీ లో పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎగుమతి చేయడం లో నెంబర్ 1. రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే 5 లక్షలు తీసుకుంటున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సిట్ విచారణ వేయండి..అభ్యంతరం లేదు. కానీ ఆరు నెలల నుంచి రేషన్ బియ్యం ఎందుకు కంట్రోల్ చేయలేక పోయారు. రేషన్ బియ్యం చాలా చిన్న వాళ్ళు ఎగుమతి చేస్తారు. ఎగుమతిదారులుకి సంబధం ఉండదు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి అని ద్వారంపూడి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news