2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. XLRI స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అన్నారు. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. వచ్చే మూడేళ్లలో మూడో స్థానాన్ని కైవలం చేసుకుంటుందని తెలిపారు.
75 ఏళ్ల క్రితం XLRI ఆవిర్భవించినప్పుడు ప్రపంచం భారతదేశాన్ని ఆర్థిక రంగంలో కూడా లెక్కించలేదని తెలిపారు. ప్రస్తుతం యూఎస్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్త అని.. భారత్ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్త 30లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపారు. సంపద సృష్టి కర్తలుగా, ఉద్యోగ సృష్టి కర్తలుగా ఉండాలి. లక్షలాది ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం భారత్ కు ఉందని.. డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్టక్చర్ కోసం ప్రపంచం బారతదేశం వైపునకు చూస్తోంది అని తెలిపారు.