రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని.. ఈవీఎంల ప్రభుత్వం అని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికి వదిలేసి ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని.. జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు. ః
రాష్ట్రంలో ప్రజా కంటక పాలన జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పాలనను మరిచిపోయి కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఎన్ని సార్లు అయినా మోసం చేసే ఏకైక సీఎం చంద్రబాబు అన్నారు.