బలమైన బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టింది.. చాపకింద నీరులా తమ వ్యుహాలను అమలు చేసింది.. బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న ఒకరిద్దరు నేతల్ని పార్టీలోకి తీసుకుని.. పాతనేతలను సమన్వయం చేసుకుని.. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.. చాలా మందే సీనియర్లు ఉన్నా.. రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది..
వివిధ పార్టీల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి.. ఏకంగా సీఎం పీఠానే అధిరోహించారు.. బీఆర్ఎస్ పై అనేక పోరాటాలు చేసి.. చివరికి జైలుకు కూడా వెళ్లారు.. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ ను ఏకతాటిమీదకు తీసుకొచ్చారు.. సమిష్టిగా పనిచేసి.. గతేడాది ఇదే రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించారు.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు హామీలిచ్చింది.. రాజకీయ ఉద్దండుగా పేరుగాంచిన కేసీఆర్ ను ఓడించాలంటే.. రాజకీయ చతురత మాత్రమే కాదు.. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎదుటివారిని మాటలతో ఆకట్టుకోవాలని ఇవన్నీ రేవంత్ లో ఉండటం వల్లే ఆయన సీఎం అయ్యారు..
సీఎం అయ్యాక అయన ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్నారు. ఇచ్చిన హమీల్లో కొన్నింటిని మాత్రమే ఆయన అమలు చేశారు.. రైతు రుణమాఫిని అమలు చేసింది.. అందులో చాలా మందికి రుణమాఫి అవ్వలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేసినా.. చాలా మంది రైతులకే ప్రయోజనం చేకూరింది.. అధికారంలోకి రాగానే ఉచిత బస్సును కూడా అమలు చేసి.. మహిళల నమ్మకాన్ని రేవంత్ సర్కార్ నిలబెట్టుకుంది..
మిగిలిన చాలా హామీలు ఇంకా ట్రాక్ ఎక్కలేదనే విమర్శలు ఉన్నాయి.. వృద్ధాప్య పిన్షన్లను నెలకు నాలుగు వేల దాకా పెంచుతామని దివ్యాంగులకు ఆరు వేలకు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.. కానీ ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. మొదటి ఏడాదిలో సగానికి సగం కూడా ఉద్యోగాలు భర్తీ చెయ్యలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి..
ఎన్నికల సమయంలో తెలంగాణ అమరవీరులకు అన్యాయం జరిగిదంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక వారికి ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోవడం కూడా కాంగ్రెస్ కు మైనస్ గా ఉంటుంది.. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో అభివృద్దిమీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు.. ఇదే సమయంలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ను, బిజేపీని ఎదుర్కొనేందుకే రేవంత్ రెడ్డి సమయం సరిపోయింది.. ఏడాది పాలనలో హామీలన్ని అమలు చెయ్యడం ఏ పార్టీకి కుదరదు.. కానీ ఒకటి రెండు హామీలను మాత్రం రేవంత్ సర్కార్ పక్కాగా అమలు చేసింది.. మరో నాలుగేళ్లు రేవంత్ సర్కార్ కు అగ్నిపరీక్షగా ఉంటాయనేది రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం.. ఓ వైపు హామీల అమలు, మరోవైపు ప్రతిపక్షాలకు ఎదుర్కోవడం రేవంత్ కు కత్తిమీద సాములాంటిదే..