సిరాజ్, ట్రావిస్ హెడ్ లపై ఐసీసీ చర్యలు..!

-

భారత బౌలర్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇద్దరికీ ఒక్కో డీ మెరిట్ పాయింట్ ఇస్తూ.. అదనంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో సెంచారు చేసి ఊపు మీద ఉన్న ట్రావిస్ హెడ్ ని ఔట్ చేసిన తర్వాత సిరాజ్ అతనికి ఫైరీ సెండాఫ్ ఇచ్చాడు.

దాంతో సిరాజ్ వైపు చూస్తూ ఏదో కామెంట్ చేసాడు హెడ్. ఆ తర్వాత ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ హెడ్ కి సెండ్-ఆఫ్ ఇచ్చాడు సిరాజ్. అయితే మ్యాచ్ అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేశావ్ అని పొగిడాను.. కానీ సిరాజ్ తప్పుగా అపార్థం చేసుకున్నాడని హెడ్ చెప్పగా.. హెడ్ అలా అనలేదని.. హెడ్ కామెంట్ చేయడం వల్లే నేను అలా చేశాను అని వివరణ ఇచ్చాడు సిరాజ్. అయితే ఇద్దరిపై చర్యలు ఐసీసీ తీసుకుంది, ఇక ఇద్దరు కూడా తమ తప్పులను అంగీకరించారు అని పేర్కొంది ఐసీసీ.

Read more RELATED
Recommended to you

Latest news