టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరింత దిగజారిన రోహిత్ శర్మ..!

-

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరింత దిగజారాడనే చెప్పాలి. ముఖ్యంగా తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో హిట్ మ్యాన్ 31వ స్థానంలో నిలిచాడు. ఇటీవలే బ్యాటింగ్ లో విఫలం అవుతున్న రోహిత్ శర్మ తాజాగా ర్యాంకింగ్స్ లో ఏకంగా 6 స్థానాలు పతనమయ్యాడు. అనేక టెస్ట్ లలో మరపురాని ఇన్నింగ్స్ లు ఆడిన ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ కనీసం టాప్-30 లేకుండా పోవడం వల్లనే అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఈ జాబితాలో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారి బ్రూక్ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. తన దేశానికే చెందిన జో రూట్ ను వెనక్కి నెట్టి ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో హ్యారీ బ్రూక్ అగ్రస్థానానికి ఎగబాకాడు. టీమిండియాలో ఇతర బ్యాటర్ల విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ 5 స్థానాలు పతనమై 20వ ర్యాంకు, రిషబ్ పంత్ 3 స్థానాలు పతనమై 9వ ర్యాంకులో నిలిచారు. యశస్వి జైస్వాల్ 4వ ర్యాంకులో కొనసాగుతుండగా.. శుభ్ మన్ గిల్ 18 నుంచి 17వ ర్యాంకుకు ఎగబాకాడు. నితీశ్ కుమార్ రెడ్డి 6 స్థానాలు మెరుగుపరుచుకుని 69వ స్థానానికి చేరాడు.

Read more RELATED
Recommended to you

Latest news