స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పైన ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళగిరి లో స్కిల్ సెన్సస్ చేసాం. మంగళగిరి, తాడేపల్లి లకి చాలామంది వలస వస్తారు. అయితే స్కిల్ సెన్సస్ అనేది ప్రస్తుతానికి ఆప్షనల్ అని అన్నారు. స్కిల్ సెన్సస్ ఆరు నెలల్లో అవ్వాల్సినది ఇంకా కాలేదు. స్కిల్ సెన్సస్ ఎప్పటి లోగా పూర్తి చేస్తారనేది తెలియాలి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ డిగ్రీలను గుర్తించాలి అన్నారు.
అలాగే ఎడ్యుకేషన్ విషయంలో చాలా స్లో గా ఉన్నారు. స్కిల్ లో లేదా ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఏదో లోపం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ లో రిజల్ట్ చాలా డల్ గా ఉంది. స్కిల్ కోసం కేంద్ర పధకంలో రిజిష్టర్ చేసే వారిని మానిటర్ చేయాలి అని సూచించారు. ఇక డీఎస్సీ మీటింగ్ లు తగిన విధంగా జరగలేదు. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. సచివాలయాల ద్వారా టెక్నికల్ స్కిల్స్ పెంచాలి స్ని స్పష్టం చేసారు.