అల్లు అర్జున్ అరెస్ట్ పై కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి సూపరింటెండెంట్ బ్లాక్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు బన్నీని తరలిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సాయంత్రం 4గంటలకు విచారిస్తామని వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

అల్లు అర్జున్ అరెస్ట్ పై కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు. అల్లు అర్జున్ కారణంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళా మరణించిందని అరెస్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరీ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా..? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు కే.ఏ.పాల్.

Read more RELATED
Recommended to you

Latest news