ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ను తన నివాసంలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆయనకు గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. మేజిస్ట్రేట్ విచారణ చేపట్టిన తరువాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బిగ్ రిలీప్ అనే చెప్పాలి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ తన వాదనలను స్ట్రాంగ్ గా వినిపించారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ వర్తించవని కోర్టు పేర్కొంది.