కేటీఆర్ గురుకుల బాటకు పిలుపు ఇవ్వడం వల్లనే మంత్రులు హాస్టల్స్ బాట పట్టారు అని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ,గురుకుల పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మరణించారు. బీఆర్ఎస్వీ నేతృత్వంలో గురుకుల బాట కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నాం. గురుకుల బాట కార్యక్రమం రిపోర్ట్‌ను కేసీఆర్‌కు అందించామని తెలిపారు.
గురుకుల బాటకు వెళ్తే మాపైన కేసులు పెట్టారు. మేము కేసీఆర్‌కు రిపోర్ట్ ఇచ్చాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. పిల్లలు చనిపోతే కదలని ప్రభుత్వం నిన్న హడావిడి చేసింది. పిల్లలతో నిన్న కాంగ్రెస్ మంత్రులు పిక్నిక్ పెట్టారు. పిల్లలను చూసేందుకు కేవలం తల్లులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం ప్రధానోపాధ్యాయులకు మెసేజ్ పంపింది. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నిన్నటి ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. తన నియోజకవర్గంలో కార్యక్రమానికి బోధ్ ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు ఏం తేడా లేదని తెలిపారు. 2023లో డైట్ చార్జీలు పెంచడానికి సబ్ కమిటీ వేసినట్టు గుర్తు చేశారు.