విజయవాడ నగరం అమరావతి రాజధానిలో ఒక భాగం. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో విజయవాడ వెనుకబడింది అని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో డైనమిక్ లాంటి అధికారులు అన్నారు. మగవారికి ధీటుగా మహిళలు ఉంటారు అనడానికి డ్రోన్ పై లెట్స్ అయిన మహిళా పోలీసులే ఆదర్శం. అప్పా, గ్రౌండ్స్, సిసి లైట్స్ కు నిధులు తీసుకురావడానికి కృషి చేస్తాను. మన డ్రోన్ షో ప్రపంచంలోనే నిలిచిపోయింది. నగర పోలీసు కమిషనర్ నగరాన్ని డ్రోన్ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. మున్సిపల్ కమీషనర్ కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అని అన్నారు.
అయితే అధికారులకు ప్రజాప్రతినిధుల సహకారం పూర్తిగా ఉంటుంది. విజన్ 2047 ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. దానికి అందరం సహకరిద్దాం. చంద్రబాబు విజన్ 2020 లో ఫలాలు అందుకున్న లక్షమండిలో నేను ఒకడిని. ఇక జీరో క్రైమ్ సిటీగా విజయవాడ ఉండాలి అని కేశినేని చిన్ని పేర్కొన్నారు.