జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు కు మంత్రీ పదవీ ఇవ్వనున్నట్టు ఇటీవలే సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. మంచి ముహూర్తం చూసుకొని రాజ్ భవన్ లో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. ఈ ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మరో 5 నెలల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాలీ కానున్నాయి.
అందులో ఒకటి నాగబాబుకు ఫిక్స్ అన్నమాట. ఎమ్మెల్సీ అయిన తరువాత నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటారా.. లేక ముందుగానే మంత్రిని చేసి తరువాత ఎమ్మెల్సీని చేయాలా..? అనే విషయం పై ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో చర్చలు జరిపారు. మంత్రిగా ప్రమాణం చేసిన తరువాతనే ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. నాగబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడనుంది.