పట్టణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి అని నెల్లూరు జిల్లా వేదికగా రాష్ట్ర మంత్రి నారాయణ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అధికంగా పట్టణాభివృద్ధి సంస్థలు వచ్చాయి. వైసీపీ హయంలో పట్టణాభివృద్ధి సంస్థలను విస్మరించారు. మున్సిపాలిటీ నిధులను కూడా పక్కదారికి మళ్ళించారు అని పేర్కొన మంత్రి.. నెల్లూరు నగరంలో తాగు నీరు…భూగర్భ డ్రైనేజ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు.
అదే విధంగా లే ఔట్లు, ఇంటి ప్లాన్ ల అనుమతుల్లో సరళీకరణ విధానాన్ని తీసుకువస్తున్నాం. నిబంధనల ప్రకారం భవనాలను నిర్మించకపోతే సంబంధిత లైసెన్స్ డ్ ఇంజనీర్ లేదా సర్వేయర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. అలాగే సాలిడ్ వేస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. మొదటి దశలో నెల్లూరు, కాకినాడ లలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తాం అని మంత్రి నారాయణ స్పష్టమ చేసారు.