రేవంత్ రెడ్డి దమ్ముంటే E-కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టు : కేటీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొగోడే అయితే E-కార్ రేసింగ్ తో పాటు అన్ని స్కామ్ లపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయాడు అల్లు అర్జున్. తెలంగాణ సీఎం అని అటు ఇటు చూశాడు. అయితే పేరు మరిచిపోగానే జైలులో పెడతావా..? అని ప్రశ్నించారు కేటీఆర్.

KTR
KTR

ఊటి అన్నాడు.. మన్ను అన్నడు మశానం అన్నడు ఏది లేదు ఉన్నదే పోయింది అన్నారు. ఉన్న రైతు బంధు ఎగ్గొట్టినోడు కొత్తగా ఏమన్న ఇస్తాడా..? అని ప్రశ్నించారు. ఊరూరికి.. అమ్మతోడు చెబుతున్న ఇంకొకడు ఇంకొకడు అయితే రోషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతికి ఉన్నడు. సిగ్గు తప్పినోడు, ఇజ్జత్ లేనేడు కాబట్టి బతుకుతున్నాడు. ఇంకొకడు అయితే బకెట్ల నీళ్లు పోసుకొని నీళ్లల్ల దూకి చచ్చిపోతుండే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news