రాజ్ భవన్ ముందు రేవంత్ రెడ్డి ధర్నా చేయడం విడ్డూరకరం అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ వ్యవహారంలో మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. పదేళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోతూ వస్తోంది. జార్జ్ సోరెోస్ తో కుమ్మక్కై రాహుల్ గాంధీ దేశ పరువు తీసే ప్రయత్నం చేశారు. అదానీ రూ.100 కోట్ల పై రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ కు ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేదన్నారు.
కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురవింద గింజ సామెతలా ఉందన్నారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏ మాత్రం అవగాహన లేకుండా మిడి మిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. వర్థమాన రాజకీయాల గురించి అవగాహన లేదు. దేనిపై రాహుల్ గాంధీకి అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో స్వయంగా మనం చూస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆధారాలు చూపకుండా గాలి మాటలు మాట్లాడితే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.