తమిళనాడు లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నాడులోకిన వేలూరు జిల్లాలో యువతిని చంపింది చిరుత పులి. వంట చేయడానికి కట్టెల కోసం అడవిలోకి వెళ్లింది అంజలీ అనే యువతి. ఇక కట్టెలు తీసుకొని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా యువతిని ఎటాక్ చేసింది చిరుతపులి. వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి గొంతు పట్టుకొని అడవి లోకి తీసుకొని వెళ్లింది చిరుత. చీల్చి చెండాడి… ప్రాణాలు తీసింది చిరుత.
అంజలీ సాయంత్రం ఎంతకీ తిరిగి రాకపోవడం తో అడవిలో వెతకారు గ్రామస్థులు. ఇక 30 కిలోమీటర్ల దూరంలో అంజలీ శవాన్ని గుర్తించారు గ్రామస్థులు. దీంతో విషాదం లో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన స్థలాన్ని పరిశీలించారు అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్. చిరుతను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. మెల్ మోలీ గ్రామ పంచాయతీ లో నివాసం ఉండేది అంజలీ కుటుంబం. ఆ గ్రామంలో 50 కుటుంబాలు ఉంటున్నట్లు సమాచారం. చిరుత… అంజలీ ని చంపడంతో భయంతో వణికిపోతున్నారు గ్రామస్థులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.