తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా వ్యవహారం సంచలనం కల్గిస్తోంది.. దీనిపై ప్రభుత్వంలోని కీలక నేతలు వ్యక్తం చేసినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు.. అక్రమ నిర్మాణాలు, మూసీ పరిరక్షణ కోసమే అని ఆయన సీఎం చెబుతున్నా.. దానిపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ క్రమంలో హైడ్రా అధికారులు చేసిన ఓ పని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది..
నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసి అందరికీ షాక్ ఇచ్చని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు మరికొందరి ప్రముఖలకు చెందిన ఇళ్లపైకి, ఆస్తుల పైకి బుల్డోజర్లను పంపాలని చూస్తోంది. ఇప్పటికే కొందరి ఇళ్లకు మార్కింగ్ కూడా చేసేవారు.. వారిలో నందమూరి బాలకృష్ణతో పాటు.. జానారెడ్డి నివాసాలు కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లు, రోడ్ల విస్తరణ చేపట్టాలని సంకల్పించింది. కేబీఆర్ పార్కు చుట్టూ 6 అండర్‌పాస్‌లు, 8 ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్లాన్లు కూడా సిద్ధం చేసి పెట్టారు. టెండర్లను పిలిచేందుకు అధికారులు పైల్స్ సిద్దం చేస్తున్నారు.. కేబీఆర్ పార్క్ చుట్టూ చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాల ఇళ్లు, ఆస్తులు ఉన్నాయి. సరిగ్గా కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ ముందే టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఇల్లు, మాజీమంత్రి జానారెడ్డి ఇల్లు ఆ లిస్ట్‌లో ఉన్నాయి.. దీంతో అక్కడ ఉండే నివాసాలకు అధికారులు మార్కింగ్ చేసేశారు..
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు కొంత భాగం కూల్చేయాల్సి వస్తుంది. మరి రేవంత్ సర్కార్.. టీడీపీ ఆఫీస్ జోలికి వెళ్తుందా.. లేదంటే ప్రత్నామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అలాగే రోడ్ నెంబర్ 45 ఎంట్రెన్స్‌లో నందమూరి బాలకృష్ణ నివాసం ఉంటుంది. దీన్నికూడా కొంతమేరకు కూల్చెయ్యాల్సి ఉంటుంది.. దీనిపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. జానారెడ్డిది కూడా అదే పరిస్థితి.. వీరందరూ కూల్చివేతలకు ఒప్పుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి..