కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు..!

-

రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేస్ లో హై కోర్టు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దు అని చెప్పింది. ఇది డొల్ల కేస్ అని మొదట్లోనే తేలిపోయింది. కేటీఆర్ కు శుభాకాంక్షలు అని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో తప్పులు మాట్లాడారు. మేము మాట్లాడతం అంటే అవకాశం ఇవ్వలేదు. మేము చర్చకు అడిగితే ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ఈ విషయం పై సభలో మాట్లాడారు. 600 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని అసెంబ్లీ లో చెప్పారు. 27 డిసెంబర్ 2023 న ఫార్ములా ఈ వాళ్ళు దాన కిషోర్ కు ఒక లేఖ రాశారు. 45 లక్షల పాండ్లు చెల్లించలేదని రద్దు చేసుకుంటున్నాం అని లేఖ రాశారు.

కానీ సభలో 600 కోట్ల నష్టం జరిగింది అని రేవంత్ రెడ్డి చెప్పారు… నష్టం కాదు లాభం జరిగేద. ఈ రాష్టం ప్రతిష్ట ను దెబ్బతీశారు. మేము సభలో ఉండి ఉంటే అక్కడే ఈ విషయం చెప్పేవాళ్ళం. ఇక్కడ అవినీతి కేస్ పెట్టారు. డైరెక్ట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి.. ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news