రైతు బంధు పై సమగ్రంగా చర్చ జరగాలన్నారు కేటీఆర్. సాగు చేస్తేనే రైతు బంధు ఇస్తామంటే.. రైతులు అన్ని పంటలు వేస్తారు. ఎన్ని పంటలకు రైతు భరోసా ఇస్తారు. రైతు బంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ఉన్నది ఉన్నట్టు ఇస్తామంటూ రైతు భరోసా పై చర్చ ఎందుకు మంత్రి తుమ్మలను ప్రశ్నించారు కేటీఆర్. పీఎం కిసాన్ మార్గ దర్శకాలతో అయితే కేవలం 25 శాతం మంది రైతులకే రైతు భరోసా అందుతుందని తెలిపారు కేటీఆర్.
తెలంగాణలో 30, 40 ఎకరాలు ఉన్న రైతులకు కూడా మేము రైతు బంధు ఇచ్చామని తెలిపారు. రైతు బంధు తో రైతుల ఆత్మహత్యలను తగ్గించామని తెలిపారు. రైతు బంధు ఇవ్వడం వల్లనే 2 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతుండగా రేవంత్ ని అడగండి అంటూ ఏక వచనంతో మాట్లాడారు. ఈ సందర్భంలో సభా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏక వచనంతో పిలువ కూడదని సూచించారు.