రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా పై మంత్రి కీలక ప్రకటన

-

రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  గుడ్ న్యూస్  చెప్పారు. సంక్రాంతి కల్లా రైతు భరోసా అందివ్వనున్నట్టు అసెంబ్లీ చర్చలో భాగంగా తెలిపారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వం రైతు బంధు కింద రైతులకు రూ.80వేల కోట్లు ఇచ్చింది. సాగు చేయని భూములను కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగు భూములకే భరోసా అందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతు భరోసా సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తామని పేర్కొన్నారు.

రైతు భరోసా పై అధికార, ప్రతి పక్షాల అభిప్రాయాలను తీసుకొని రైతులకు ఏ విధంగా ఇవ్వాలని నిర్ణయిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 2017-18 రైతు బంధు తీసుకొచ్చింది. ఒక సీజన్ కి ఎకరానికి రూ.4వేల చొప్పున రైతుల జమ చేసిందని తెలిపారు. 2018-19 లో 5వేలకు పెంచి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం జనవరిలో అమలు చేయ తలపెట్టిన పథకానికి సభలోని సభ్యుల అబిప్రాయాలను సేకరించి వీటన్నింటిని క్రోడీ కరించి.. తుది విధానాలను నిర్ణయించి సంక్రాంతి పండుగ లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని కీలక ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news