గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు అని ACP విష్ణు మూర్తి అన్నారు. కానీ డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మిట్ పెట్టవచ్చా. కొన్ని ఘటనలను ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడు సదరు హీరో. ఒక్క 1లక్ష పై చిలుకు పోలిసుల కుటుంబాలు ఉన్నాయి. ఒక్క బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదు. పోలీసులను నోటికి వచిన్నట్టు కొందరు నటులు,రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
మేము ఒక్క పది నిమిషాలు తప్పుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి. అందరు పనులు చేసుకుంటే పోలీసు అధికారి రోడ్ల మీద ఉంటారు. సమాజం కోసం అతను అన్ని వేళలో అందుబాటులో ఉంటాడు. మేము మనుషులమే మమ్మని అవమాన పరిచే విధంగా చేస్తున్నారు. నాకు అక్కడ ఒక్క ఇన్సిడెన్స్ గణించ ఒక నటుడు ప్రెస్ మీట్ పెట్టీ ఒకటే ముచ్చట చెప్తుండు. కేసులో ముద్దయి ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా.. ఈ విషయాలన్నీ కోర్టు కు తీసుకెళ్ళి బెయిల్ కాన్సల్ చెపించే అవకాశం కూడా ఉంది అని ACP విష్ణు మూర్తి పేర్కొన్నారు.