సంధ్య థియేటర్ ఘటనపై సాక్షాలు బయట పెట్టిన పోలీసులు..!

-

సంధ్య థియేటర్ ఘటనపై నిన్న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో ఆయన చేసిన కామెంట్స్ పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని వివరిస్తూ.. సీపీ ఆనంద్ సమక్షంలో పోలీసులు సాక్షాల రూపంలో సంధ్య థియేటర్ సీసీ ఫుటేజ్ ను బయట పెట్టారు. బయట తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోయింది అనే విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పేందుకు వెళ్తుండగా.. మేనేజర్ నేను చెప్తాను అని నాతో అన్నాడు చిక్కడపల్లి ఏసిపి రమేష్ స్వయంగా తెలిపారు. కానీ నేను సినిమా చూసాకే వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పినట్లు ఆయన వివరించారు.

ఇక చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ మాట్లాడుతూ.. రేవతిని, చిన్న బాబు తేజ ను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించాను. SI మౌనిక, నేను రేవతి కి CPR చేసాము.. కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ మా ముందే రేవతి ప్రాణాలు పోయాయి. తొక్కిసలాట లో నా ప్రాణాలు కూడా పోయేవి అని వివరించారు. అయితే విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ.. అల్లు అర్జున్ బయటకు రాలేదు అంటూ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అలాగే నేను బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా.. పబ్లిక్ ను ఎక్కడైనా తోసివేస్తే.. తాట తీస్తాం. బౌన్సర్ల తీరుకు.. సెలబ్రిటీలే బాధ్యత వహించాల్సి వస్తుంది. బౌన్సర్లను పెట్టుకున్న వాళ్ళదే పూర్తి భాధ్యత అని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news