రాష్ట్రంలో ప్రతి దానికి వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారు.. మీకు సిగ్గుగా లేదా. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి ఎవరు కారణం ? అన్నిటికీ జగన్ కారణం ఐతే ,ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది.. గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుందా అని సీరియస్ అయ్యారు అంబటి రాంబాబు. చంద్రబాబు, మోడీ, పవన్ చెప్పిన మాటలకు ప్రజలు నమ్మి ఓటు వేసి బాదపడుతున్నారు. ఫైబర్ నెట్ లో అవకతవకలు ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు. కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదు.
ఇక సోషల్ మీడియా లో పోస్టులు పెడితే నెలలు తరబడి జైల్లో పెడతారా.. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ ని అణచాలని చూస్తే మరింత రాటుదేలతాం.. మీ సంగతి తెలుస్తాం అని అన్నారు. ఇక ముగ్గురు కలసి వస్తే మాకు 11 సీట్లు వచ్చాయి.. అది నాయకుల మహత్యమో, ఈవీయంల మహత్యామో తేలాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రాష్ట్రం లో బెల్టు షాపులు ప్రతి చోటా పెడుతున్నారు. రేషన్ బియ్యం సరఫరా జరుగుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు అంబటి.