Rohit Sharma Retirement Date: రిటైర్మెంట్‌పై రోహిత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న చివరి టెస్టు తర్వాత టెస్టులకు వీడ్కోలు పలుకనున్నట్లు సమాచారం.
ఫామ్ లేమి కారణంగా రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. కాగా, ఈ ఏడాది టెస్టుల్లో 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. దీంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న చివరి టెస్టు తర్వాత టెస్టులకు వీడ్కోలు పలుకనున్నట్లు సమాచారం అందుతోంది. మరి దీనిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.