అచ్చొచ్చిన ఆంబోతులా కౌశిక్ రెడ్డి ప్రవర్తన : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

-

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశం ఘటన పై స్పందించారు వెంకట్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్చొచ్చిన ఆంబోతులా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఒక రౌడీ, ఒక వీధి గూండాలాగా వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం మీడియాలో కనిపించడం కోసమే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు రెండో విడుత దళిత బంధు రావాలంటే తనను గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందంటూ బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డారని గుర్తు చేశారు. దళితులను మోసం చేసింది.. బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. దళితులను సీఎం చేస్తానని.. ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కాదా..? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇలాగే ప్రవర్తిస్తే.. రోడ్డుపై గుడ్డలూడదీసి కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news