సాధారణంగా బలవనతంగా వసూళ్లు చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు…? డబ్బులు ఎక్కువగా ఉండే వాళ్ళను కిడ్నాప్ చేయడమో, లేక చంపేస్తామని బెదిరించడమో అప్రతిష్ట పాలు చేయడమో చేస్తూ ఉంటారు. కాని కొంత మంది యువకులు ఏకంగా మంత్రిని బెదిరించారు. ఈ ఆశ్చర్యకర ఘటన గోవాలో చోటు చేసుకుంది. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తమకు రూ.3కోట్లు ఇవ్వాలని లేదంటే అప్రతిష్టపాలు చేయడంతోపాటు హతమారుస్తామని మంత్రిని ముగ్గురు యువకులు ఫోన్లో బెదిరించారు. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాలో కలకలం రేపింది. ఆ రాష్ట్ర ప్రజా పన్నుల శాఖ మంత్రి దీపక్ పౌష్కర్ కు ముంబై నగరానికి చెందిన ముగ్గురు గుర్తుతెలియని యువకులు ఫోన్ చేసి, తమకు రూ.3 కోట్లు ఇవ్వాలని,
లేదంటే అతన్ని అప్రతిష్ట పాలు చేయడంతోపాటు హత్య చేస్తామని మంత్రిని బెదిరించారు. ఆయనకు ఆ యువకులు పలు మార్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. దీనితో విసిగిపోయిన మంత్రి గారు పోలీసులకు ఇర్యాదు చేసారు. దీనితో పోలీసులు పథకం ప్రకారం డబ్బులు ఇస్తామని పిలిచి ముగ్గురిని విచారిస్తున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.