అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం…!

-

అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ కావడంతో మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా అటు కమర్షియల్ గా కూడా హిట్ అవడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఉబ్బి తబ్బిబ్బు అవుతుంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ కి బిగ్ షాక్ తగిలింది.

బన్నీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అర్జున్ పెద్ద మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ కన్ను మూశారు. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు ప్రసాద్ నిర్మాతగా కూడా ఉన్నారు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి సోదరుడు. ఒక పక్క సినిమా హిట్ అయి మరో సినిమాకు,

కొబ్బరికాయ కొట్టే తరుణంలో ఈ వార్త షాక్ కి గురి చేసింది. విజయవాడలో జనవరి 22న ఈయన తుది శ్వాస విడిచారు. అల్లు అర్జున్ కి ప్రసాద్ తో చిన్నప్పటి నుంచి కూడా సన్నిహిత సంబంధం ఉంది. అలాంటి మేనమామ మరణించడంతో ఇప్పుడు అల్లు అర్జున్ తీవ్ర విషాదంలో ఉండిపోయారు. ఇండస్ట్రీలోని పలువురు సిని ప్రముఖులు ఈయన కుటుంబానికి సంతాపం తెలియచేసారు.

Read more RELATED
Recommended to you

Latest news