కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని చెప్పిన సుప్రీం కోర్టు… కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. దీంతో పిటీషన్ ను విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు కేటీఆర్ తరపు న్యాయవాది.
హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు చెప్పిన తరుణంలో… సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు కేటీఆర్. ఫార్మలా ఈ రేస్ కేసులో పూర్తిస్థాయిలో.. విచారణ జరగాలని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది సుప్రీం కోర్టు.
కాగా, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన FIR రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు కేటీఆర్. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు నిరాశే ఎదురైంది.