తెలంగాణ కేబినెట్ విస్తరణ పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 మంత్రి పదవీలు ఖాలీగా ఉన్నాయని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ పై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన తరువాత చర్చిస్తామని వెల్లడించారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని హైకమాండ్ చెప్పిందని తెలిపారు.
ఇటీవల జరిగిన ఏఐసీసీ సమావేశంలో చేసిన పనిని చెప్పుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. అయితే ప్రజల డబ్బు వృధా అవుతుందని.. అందుకే పబ్లిసిటీ చేయడం లేదని వివరణ ఇచ్చినట్టు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన లబ్దిదారుల ఎంపికను ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.