నాతో నడిచేందుకు ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి : రాహుల్ గాంధీ

-

ఈ ఉద్యమంలో నాతో కలిసి నడిచేందుకు ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సహపరిచేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాహుల్ గాంధీ.. ఆదివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నేడు మోడీ ప్రభుత్వం పేద, శ్రామిక వర్గాలకు వెన్నుపోటు పొడిచి, వారి శ్రేయస్సును పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించింది. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి అంతా ఎంపిక చేసిన కొంత మంది పెట్టుబడిదారులను సంపన్నం చేయడంపైనే ఉందని, దీనివల్ల అసమానతలు నిరంతరం
పెరుగుతూ దేశాన్ని పోషించేందుకు కష్టపడి పనిచేసే కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా
మారుతోందని అన్నారు.

వారు వివిధ రకాల అన్యాయాలను, దౌర్జన్యాలను ఎదుర్కోవల్సి వస్తోందని తెలిపారు. అటువంటి పరిస్థితిలో, వారికి న్యాయం చేసేందుకు, వారు తమ హక్కులు పొందడం కోసం మనమంతా కలిసి
గళం ఎత్తడం మనందరి బాధ్యత అని హితవు పలికారు. ఈ ఆలోచనతోనే వైట్ టీషర్ట్ మూవ్మెంట్
ను  ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొనవలసిందిగా యువత, కార్మిక వర్గ మిత్రులకు విజ్ఞప్తి చేశారు

Read more RELATED
Recommended to you

Latest news