మనకు వంట ఇంట్లో కొన్ని కొన్ని చిట్కాలు తెలియక వంటలను పాడు చేసుకుంటూ ఉంటాం కదూ, వంటింట్లో చిన్న చిన్నవి ఫాలో అయితే చాలు కొన్నింటి నుంచి మంచి ఫలితాలు సాధించవచ్చు.
అవి ఏంటో ఒక్కసారి చూద్దాం…
కొద్దిగా నిమ్మరసం పిండితే పుదీనా, కొత్తిమీర చట్నీ రంగు మారకుండా ఉంటుంది. కొన్ని మెంతులు కాచిన నెయ్యిలో వేస్తే కమ్మటి వాసన వస్తుంది.
రెండు లవంగాలు వంటనూనె నిల్వ ఉంచిన డబ్బాలో వేస్తే సువాసన వస్తుంది.
బియ్యం బస్తాలో కొన్ని లవంగాలను మూటగట్టి ఉంచితే బియ్యం పురుగుపట్టదు.
చిటికెడు చక్కెర ఆకుకూరలు వండేటప్పుడు వాటిల్లో కలిపితే వాటి సహజరంగు కోల్పోవు.
చిటికెడు పంచదార ఉల్లిపాయ ముక్కల్లో వేస్తే తొందరగా వేగుతాయి.
నూనెలో అరచెంచా వెనిగర్ వేస్తే వంటకాలు తక్కువ నూనెను పీల్చుకుంటాయి.
కిచెన్ చిట్కాలు ఇవి…!
-