మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర’ మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది.
రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలాగానే రవితేజ తన ఎనర్జిటిక్ యాక్టింగ్, కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు. విక్రమార్కుడు లెవల్లో మాస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈసారి రవితేజ అభిమానులకు నిజంగానే మాస్ జాతర ఉండేలా ఉందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ మూవీలో రవితేజ సరసన హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. మే 9న మాస్ జాతర థియేటర్ల ముందుకు రానుంది.