ఇటీవల ఆంధ్ర శాసన సభలో ఆమోదం పొందిన కేంద్రీకరణ బిల్లును మండలిలో శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడం పట్ల తీవ్రస్థాయిలో సీరియస్ అయిన వైఎస్ జగన్ అసెంబ్లీలో శాసన మండలి రద్దు అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి నిర్వహించడానికి 60 కోట్లు ఖర్చు అవుతుందని అటువంటి సభలో ప్రజలకు ఉపయోగపడే బిల్లులను అడ్డుకోవటం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దీంతో శాసన మండలి రద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొన్ననిర్ణయం డిల్లీలో ఉన్న పెద్దల దాకా వెళ్ళటంతో జగన్ అలా చేయటం ఏంటి అని చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు అని ఢిల్లీలో ఉన్న పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
అసలు శాసనమండలి సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది వైయస్ జగన్ తండ్రి అని అది జగన్ కి తెలియదా శాసన మండలి రద్దు నిర్ణయం దారుణం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం పై ఢిల్లీలో ఉన్న పెద్దలు తీవ్ర స్థాయిలో జగన్ వ్యవహరిస్తున్న తీరు పై మండిపడుతున్నట్లు సమాచారం.