టిక్ టాక్ లో సూపర్ ఫీచర్…! ఇక నుంచి పండగే…!

-

టిక్‌టాక్” ఈ రోజుల్లో ఇది ఒక నిత్యావసరం. ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా దీంట్లో తమలో ఉన్న విభిన్న కోణాలను చూపిస్తున్నారు. సినిమాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, సినిమాల్లోకి రావాలని భావించే వాళ్ళు అందరూ కూడా టిక్ టిక్ ద్వారా తమ ప్రతిభను బయటపెడుతున్నారు. తమలో ఉన్న ప్రావిణ్యం బయటపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు యువత. పాపాయి నుంచి మామ్మ గారి వరకు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు.

దీనితో మన దేశంలో టిక్ టాక్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతీ రోజు కొన్ని లక్షల వీడియోలు ఈ ఫ్లాట్ఫాం మీద అప్లోడ్ అవుతున్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సిని నటులు రాజకీయ నాయకులు అందరూ కూడా దీని మీదే ఉంటున్నారు. దీని ద్వారా స్టార్ లు కూడా అయిపోతున్నారు. దీనితో టిక్ టాక్ సంస్థ కూడా అనేక ఫీచర్లను తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

తమ యూజర్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో మరో ఫీచర్ ని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్‌టాక్ వీడియోలను మరింత అద్భుతంగా మార్చేందుకు గాను కంపెనీ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. మెర్లిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టిక్ టాక్ సంస్థ, సరికొత్త మ్యూజిక్స్‌ని అందించనుంది. లక్షలాది లైసెన్స్‌డ్ మ్యూజిక్ ఆడియోలను యాక్సెస్ చేసే సదుపాయం కలగనుంది.

దీనిపై టిక్ టాక్ స్పందించింది. టిక్‌టాక్‌లో మ్యూజిక్ క్రియేషన్ దగ్గరి నుంచి దానిని ఉపయోగించడం వరకు ఇండిపెండెంట్ ఆర్టిస్టులు, లేబుల్స్ కీలకమని, మెర్లిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా టిక్‌టాక్ యూజర్లకు సరికొత్త లేబుల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే టిక్‌టాక్ యాప్‌లో కొత్త మ్యూజిక్ ట్రాక్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news