బిజెపితో పొత్తులతో రాజకీయం చేద్దామని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బిజెపి పార్టీ పెద్దలు సెన్సేషనల్ దెబ్బ పవన్ కి వేసినట్లు జాతీయస్థాయిలో అదేవిధంగా ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ని టార్గెట్ గా చేసుకుని అమరావతి విషయంలో దూకుడుగా వ్యవహరిద్దాం అని భావించిన పవన్ కళ్యాణ్ కి ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దలు ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు టాక్.
ఢిల్లీ బీజేపీ పార్టీ పెద్దల నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పిలుపు రావడంతో జనసేన పార్టీలో నేతలు తమ అధినేతను ఢిల్లీ పిలిచారని గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంలో ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ అమరావతి విషయం గురించి పట్టుబట్టే మాట్లాడటంతో బిజెపి పార్టీ నాయకులు ఇది తమ పరిధిలో లేని విషయమని కేంద్రం జోక్యం చేసుకోలేదని ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలని భావించిన తరుణంలో అదే విషయాన్ని బీజేపీకి తెలపడంతో ఇటువంటివి చేయాలంటే ముందుగా బిజెపి పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయాలని ఆ ప్రతిపాదనకు ఓకే అయితేనే అమరావతి విషయంలో ముందుకు వెళ్లే ప్రసక్తి ఉంటుందని ఢిల్లీ బీజేపీ పెద్దలు తేల్చి చెప్పారట.
మొత్తంమీద చూసుకుంటే దూకుడుగా వ్యవహారాలన్నీ నడిపించాలని భావించిన పవన్ కళ్యాణ్ కి విలీనం అంశంతో సెన్సేషనల్ దెబ్బ బిజెపి పెద్దలు వేసినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. బిజెపి పార్టీలో జనసేన పార్టీ విలీనం జరిగితే ప్రజారాజ్యం పార్టీ కంటే ఘోరమైన అవమానం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కి ఎదురు చూస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.