కేంద్రం బడ్జెట్ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ పై పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా విమర్శల పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తరపున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది భారత దేశ బడ్జెట్ అని.. ఇది తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పథకాల్లో 95% పథకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే 2025 బడ్జెట్ MSMEలు, చిన్న పరిశ్రమలకు ఆపన్నహస్తాన్ని అందించాయని ఆయన అన్నారు. తెలంగాణలో 10 లక్షలకు పైగా రిజిస్టర్ అయిన MSMEలకు ఈ బడ్జెట్ తో ప్రయోజనం చేకూర్చుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే స్టార్టప్లకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు వల్ల తెలంగాణ స్టార్టప్ లకు ఎంతో చేకూరుతుందని
అన్నారు.