కులగణన సర్వేతో అధికారికంగా జనాభా లెక్కలపై క్లారిటీ వచ్చింది అని ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు పేర్కొన్నారు. మళ్లీ రీ సర్వే అని చెప్పలేదు. ఎలా సర్వే చేసినా సమగ్రంగా లేదని విమర్శిస్తారు. ఏ సర్వే చేసినా అందరూ అందుబాటులో ఉండకపోవచ్చు. గతంలో ఒక్కరోజు చేసిన సర్వేకు.. ప్రస్తుతం 50 రోజులు చేసిన సర్వేకు చాలా తేడా ఉంటుందని తెలిపారు. హడావుడిగా ఒక్క రోజుకు చేసిన సర్వే అది.. దాదాపు రెండున్నర నెలలు చేసిన సర్వే అన్నారు.
ఉన్న రిజర్వేషన్లు ఎన్ని..? ఎంత వరకు పెంచాలన్నది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. బీసీలకు, ఎస్సీలకు ఉన్న స్కిల్స్ మరెవ్వరికీ లేదు అన్నారు. కులగణన సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరోసారి అవకాశం కల్పించాలని సూచించారు. నివేదిక పరంగా చేస్తారో ప్రభుత్వం తెలియజేయాలి. బలహీన వర్గాల వారికి ఉన్న నైపుణ్యం మరెవ్వరికీ ఉండదు అన్నారు.