కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు ముందుకు వస్తున్నారు అని మంత్రి సీతక్క అన్నారు. గాంధీ భవన్ లో నా సమక్షంలో ఆదిలాబాద్ నేతలు పలువు చేరారు అని ఆమె తెలిపారు. అలాగే సంక్షేమం నచ్చి కులగణన, SC వర్గీకరణ మెచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు.
అయితే ఉచిత బస్ పెట్టిన నుండి రేషన్ కార్డు ఇచ్చిన వరకు.. కులగణన, SC వర్గీకరణ ఇలా ఏ పని చేసిన BRS దానికి ఉల్టా ప్రచారం చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం కుల గణన చేయలేదు. మన రాష్ట్రంలో కుల గణన చేసి చూపెట్టినం. కానీ BRS చేయని పని మేము చేసినం కాబట్టి.. BRS ఓర్వలేక పోతుంది. ఇంటి ఇంటికి తిరిగి సిబ్బంది పకడ్బందీగా సర్వే చేశారు. సర్వే అంశంలో ఇది తక్కువ అది తక్కువ అంటూ బీజేపీ, BRS కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆనాడు సర్వే చేసి వివరాలు BRS బయట పెట్టలేదు అని సీతక్క అన్నారు.