ఢిల్లీలో బీజేపీ విజయం.. ఏపీ బీజేపీ కార్యాలయంలో సంబురాలు

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఏపీలోని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తరవాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడం పై ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ మోర్చ అధ్యక్షుడు షేక్ బాజీ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

సామాన్యుల పార్టీ గా ప్రారంభమై.. అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆప్ పార్టీకి అన్ని వర్గాల ఓటర్లు గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి చెందడం గమనార్హం. బీజేపీ 48, ఆప్ 22 సీట్లను సాధించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news