ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోరాడాల్సిందని ప్రముఖ నోబెల్ అవార్డు గ్రహీత, ఆర్థికవేత్త ఆమర్త్యసేన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ బిర్భమ్ జిల్లాలోని తన పూర్వీకులు ఇంట్లో ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్ లౌకికవాదం మనుగడ సాగించాలంటే, ఐక్యత మాత్రమే కాకుండా.. భారతదేశాన్ని బహుత్వానికి అద్భుతమైన ఉదాహరణగా మార్చిన విషయాలపై ఒప్పందం ఉండాలని అన్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఐక్యత అవసరాన్ని ఆయన చెప్పారు.
ఢిల్లీ ఎన్నికలకు చాలా ప్రముఖ్యత ఉందని.. ఆప్ గెలిచి ఉంటే ఈ విజయం తన సొంత బలాన్ని కలిగి ఉండేదని అన్నారు. ఆప్ పరాజయం గురించి మాట్లాడుతూ ఢిల్లీలో హిందుత్వ ఆధారిత ప్రభుత్వం కోరుకోని వారిలో ఐక్యత లేకపోవడమే కారణమన్నారు. చాలా సీట్లలో ఆప్ పై బీజేపీ ఆధిక్యం కన్నా కాంగ్రెస్ కి లభించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వాస్తవానికి ఇండియా కూటమిలో ఆప్ ఓడిపోవాల్సిన అవసరం లేదు కానీ, ఓడిపోయిందని తెలిపారు.