టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక సమయంలో పార్టీకి అండగా ఉండే టైం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీల ని ఉద్దేశించి చంద్రబాబు డైలాగులు వేస్తున్నట్లు భవిష్యత్తులో మీరు చేసే త్యాగాలు ఎప్పటికీ మర్చిపోను అంటూ చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీల పట్ల వ్యాఖ్యానించినట్లు టీడీపీ శ్రేణుల్లో వార్తలు వినపడుతున్నాయి.
వికేంద్రీకరణ బిల్లు మళ్లీ శాసనమండలిలో చర్చకు తీసుకు రావడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నట్లు మళ్లీ అదే జరిగితే కనుక ఎమ్మెల్సీలు… బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడాలని చంద్రబాబు రెడీ చేస్తున్నట్లు ఇదే తరుణంలో ఎమ్మెల్సీలు మళ్లీ అడ్డుపడితే మండలి రద్దు చేయడానికి మరోపక్క ప్రభుత్వం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే మండలి రద్దు అనే అంశం తెరపైకి వస్తే ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే రాష్ట్ర భవిష్యత్తే అటూ ఇటూ కాకుండా అయిపోతుందని జగన్ సర్కార్ తాజాగా టీడీపీ ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికీ వైసీపీ నేతలు ఐదు కోట్ల ఆఫర్ ఇస్తున్నట్లు అంతేకాకుండా దానితోపాటు పదవి ఆఫర్ ఇస్తామని భవిష్యత్తులో ప్రభుత్వం నుండి అన్ని విధాల సపోర్ట్ ఉంటుందని ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ప్రస్తుతం అభద్రతా భావంతో ఉన్నట్లు వికేంద్రీకరణ బిల్లు కచ్చితంగా అమలు అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణం ఉండటంతో టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం.