వికేంద్రీకరణ ఇష్యూపై ఏపీ సీఎం జగన్ చాలా సైలెంట్ గా ఉండటంతో అసలు ఏపీ సర్కార్ వికేంద్రీకరణ అంశంపై సోమవారం జరగబోయే అసెంబ్లీ లో ఏ విధమైన అడుగులు వేస్తుందో అన్న టెన్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే జగన్ సర్కార్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్న తరుణంలో వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ ఏం మాట్లాడ లేని సందర్భంలో అంబటి రాంబాబు రంగంలోకి దిగి టిడిపి నేతలు చేస్తున్న కామెంట్లను తిప్పికొట్టారు.
అధికార వికేంద్రీకరణ అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని దానికి ఎవరి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యంగా బీజేపీ నేతలు అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో బలంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని స్పష్టత ఇచ్చారు.
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చాలా విప్లవాత్మక నిర్ణయాలు జగన్ తీసుకోబోతున్నట్లు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. దీంతో ఇటువంటి సందర్భంలో జగన్ కూడా ఎటువంటి మాట్లాడలేని సందర్భంలో అంబటి రాంబాబు క్లారిటీ ఇవ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి కార్యకర్తలు అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర వాసులు అంబటి రాంబాబు కి సూపర్ గట్స్ ఉన్నాయి గురు అంటూ రైట్ టైం లో క్లారిటీ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు.