నేడు కుంభమేళాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

మహా కుంభమేళా కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు. ఇది భారతదేశం యొక్క సంప్రదాయ, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబం. ఈ మహోత్సవం నమ్మకం, భక్తి, ఆచారాలు, మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న పవిత్ర వేడుక. ఈ వేడుకకు కోట్లాది మంది భక్తులు చేరుకుంటున్నారు. ఈనెల 26న మహాశివరాత్రి రోజు చివరి రోజు కావడంతో కుంభమేళాకు భక్తుల తాకిడి చాలా ఎక్కువైంది అనే చెప్పాలి.

ఇటీవలే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.. కుంభమేళాలో రెండు, మూడు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ భక్తుల రాక మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. నిన్న ప్రయాగరాజ్ లో జరుగుతున్న మమాకుంభమేళాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూపీలోని ప్రయాగ్ రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news