ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ఏపీలో ఉన్న స్కూళ్లకు ఒకే యాప్ ఉండేలా చర్యలు తీసుకోనుంది. ఏపీ విద్యాశాఖలో ప్రస్తుతం 45 యాప్ లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ 45 యాప్ ల స్థానంలో ఒకే ఒక యాప్… తీసుకురావాలని చంద్రబాబుకు సర్కారం నిర్ణయం తీసుకుంది. అందరికీ సులభతరంగా ఒకే యాప్ లో… సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

ఇందులో స్కూల్, టీచర్ అలాగే స్టూడెంట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. విద్యార్థుల సామర్ధ్యాలు, మార్కుల లిస్టు, అదే సమయంలో విద్యార్థుల ఆరోగ్య సమాచారాలు తల్లిదండ్రులు సులభంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా పాఠశాలలో సౌకర్యల సమాచారం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా స్కూల్ టీచర్ల పనితీరు, వాళ్ల కార్యకలాపాలు, బదిలీలపై కూడా ఇందులో వివరాలు ఉంటాయని వివరించింది. ఈ యాప్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుందట.